రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో మంత్రి కాసు కృష్ణారెడ్డి శనివారం భేటీ అయ్యారు.
హైదరాబాద్ : రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో మంత్రి కాసు కృష్ణారెడ్డి శనివారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో 80 శాతం మంది ప్రజలు సమైక్యరాష్ట్రాన్ని కోరుకుంటున్నారని ఆయన ఈ సందర్భంగా ప్రణబ్కు తెలిపారు. దేశ మొదటి పౌరుడిగా ప్రజల హృదయ స్పందనను కేంద్రానికి వివరించాలని ప్రణబ్‌ను ఈసందర్భంగా కాసు కోరారు. సమైక్య రాష్ట్రం కోసం సీమాంధ్ర ప్రజలతో పాటు నేతలు కూడా త్యాగాలు చేశారని గుర్తు చేశారు.
భేటీ అనంతరం కాసు కృష్ణారెడ్డి మాట్లాడుతూ విభజన జరగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతిని కోరినట్లు ఆయన చెప్పారు. పొరపాట్లు జరగకుండా చూస్తామని రాష్ట్రపతి చెప్పారన్నారు. కాగా రాష్ట్రపతిని మంత్రి రఘువీరారెడ్డి, ఎంపీ పొన్నం ప్రభాకర్ విడివిడిగా కలిశారు.