చంద్రబాబుతో నారాయణ, గంటా భేటీ | ministers ganta srinivasarao, narayana meets chandrababu naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుతో నారాయణ, గంటా భేటీ

Feb 5 2015 10:37 AM | Updated on Aug 20 2018 7:17 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గురువారం ఉదయం మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణ భేటీ అయ్యారు.

హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గురువారం ఉదయం మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణ, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ  అంశం వీరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. 

 

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 46 (2), సెక్షన్ 46 (3) ప్రకారం  ఏపీకి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని.. దానిలో భాగంగా ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ప్రకటించామని కేంద్ర ఆర్థిక శాఖ నిన్న వెల్లడించింది. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ఈ ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement