ఈలి నానికి మంత్రి పైడికొండల సవాల్ | Minister Pydikondala Manikyala Rao pressmeet in Tadepalligudem | Sakshi
Sakshi News home page

ఈలి నానికి మంత్రి పైడికొండల సవాల్

Mar 5 2016 4:18 PM | Updated on Sep 3 2017 7:04 PM

మాజీ ఎమ్మెల్యే ఈలి నాని తనపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో మంత్రి పైడికొండల మాణిక్యాలరావు సవాల్ విసిరారు.

తాడేపల్లిగూడెం (పశ్చిమ గోదావరి జిల్లా) : మాజీ ఎమ్మెల్యే ఈలి నాని తనపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో మంత్రి పైడికొండల మాణిక్యాలరావు సవాల్ విసిరారు. మంత్రి శనివారం తాడేపల్లిగూడెంలో విలేకరులతో మాట్లాడుతూ.. తాడేపల్లి నుంచి న్యూఢిల్లీ వరకు ఎక్కడైనా తాను కేసులు పెట్టించినట్లు నాని నిరూపించగలడా అని ప్రశ్నించారు.

తప్పుడు కేసులు పెట్టించినట్లు రుజువు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని పేర్కొన్నారు. ఈలి నానిపై తాను తప్పుడు కేసులు పెట్టించి ఇబ్బందులకు గురిచేస్తున్నానని ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మంత్రి పైడికొండల మాణిక్యాల్‌రావు స్పందించారు. నాని నిరూపించలేని పక్షంలో ఏం చేస్తాడో ఆయన విజ్ఞతకే వదిలేస్తానని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement