వైఎస్సార్ జిల్లా కడప నగరంలో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారం ఆకస్మిక పర్యటన చేశారు.
కడప: వైఎస్సార్ జిల్లా కడప నగరంలో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారం ఆకస్మిక పర్యటన చేశారు. నగరంలోని రవీంద్రనగర్, పాతబస్టాండ్, ఐటీఐ సర్కిల్ ప్రాంతాల్లో దాదాపు గంటపాటు తిరిగి ఆయన పారిశుధ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్ రవీందర్ పనితీరు బాగోలేదని చెప్పడంతో స్పందించిన మంత్రి... అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలని కమిషనర్‌ను ఆదేశించారు. సోమవారం సీఎం చంద్రబాబు జిల్లా పర్యటన నేపథ్యంలో ఆయన ఈమేరకు ఆకస్మిక పర్యటన నిర్వహించారు.