
సాక్షి, విజయవాడ : విజయవాడ రైల్వేస్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మధ్యాహ్న భోజన పథకం కార్మికులు చేపట్టిన ఛలో విజయవాడ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం భోజన కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులకు, మహిళా కార్మికుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. రైల్వే స్టేషన్ వద్దకు చేరుకున్న మహిళలను పోలీసులు బలవంతగా అరెస్ట్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో మధ్యాహ్య భోజన కార్మికులు విజయవాడకు తరలివస్తున్నారు.