అచ్చం అలాంటి ఘటనే. బాలాపూర్లో జరిగిన దారుణ సంఘటన తీరుగానే మరో దారుణం. అనంతపురం జిల్లాలో కంబదూరులో పాశవిక ఘటన చోటుచేసుకుంది.
అనంతపురం(కంబదూరు): కంబదూరు మండలం నూతిమడుగులో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. సోమశేఖర్(40) అనే మతిస్థిమితం లేని వ్యక్తి తల్లి, భార్యా, కుమార్తెలను పాశవికంగా నరికి చంపాడు. ఆ తర్వాత తాను గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో తల్లి నర్సమ్మ(54), భార్య రామాంజమ్మ(34), కుమార్తె చిన్ను(4) అక్కడిక్కడే మరణించారు.ఈ హఠాత్పరిణామంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.