బాత్రూం గోడలో దూరిన వ్యక్తి.. 2 రోజుల తర్వాత నగ్నంగా దర్శనం

Man Trapped Inside Wall of New York Theatre Rescued After 2 Days - Sakshi

అమెరికా, న్యూయార్క్‌లో చోటు చేసుకున్న సంఘటన

మతి స్థిమితం లేని వ్యక్తిని కాపాడిన పోలీసులు

న్యూయార్క్‌: మతి స్థిమితం లేని ఓ వ్యక్తి సినిమా థియేటర్‌కు వెళ్లాడు. ఏం అయ్యిందో తెలియదు కానీ.. బాత్రూం గోడకున్న కన్నంలో దూరాడు. దాదాపు రెండు రోజుల తర్వాత గోడ పగలగొట్టిన పోలీసులకు అక్కడ నగ్నంగా ఉన్న వ్యక్తి కనిపించాడు. అతడిని బయటకు తీసుకువచ్చి.. ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటన న్యూయార్క్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు..

కొన్ని రోజుల క్రితం మతిస్థిమితం లేని ఓ వ్యక్తి న్యూయార్క్‌లోని ఓ థియేటర్‌కు వెళ్లాడు. బాత్రూంకు వెళ్లిన వ్యక్తి.. అనుకోకుండా అక్కడ గోడకున్న పెద్ద కన్నంలోంచి లోపలికి వెళ్లాడు. అలా రెండు, మూడు రోజులు గడిచాయి. అప్పటి వరకు కన్నంలో ఉండిపోయిన వ్యక్తి.. ఆ తర్వాత సాయం కోసం కేకలు వేయసాగాడు. అప్పుడుగానీ అతగాడి గురించి థియేటర్‌ యాజమాన్యానికి తెలియలేదు.
(చదవండి: అమ్మాయి వైపు నుంచి చెప్పే ప్రేమకథ ఇది)

ఇక విషయం తెలిసిన వెంటనే థియేటర్‌ యాజమాన్యం.. పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి కాల్‌ చేసి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు.. బాత్రూం గోడకు వేరే చోట కన్నం చేసి.. దాని గుండా ఫైబర్‌ ఆప్టిక్‌ కెమరాను పంపి.. అతడు ఉన్న ఎగ్జాక్ట్‌ లోకేషన్‌ని గుర్తించారు. ఆ తర్వాత గోడను పగలకొట్టి చూడగా.. సదరు వ్యక్తి నగ్నంగా దర్శనమిచ్చాడు. 
(చదవండి: ఫస్ట్‌డేట్‌ రోజే విషాదం: టిక్‌టాక్‌ స్టార్‌ కాల్చివేత)

అతడిని బయటకు తీసుకువచ్చిన పోలీసులు సమీప ఆస్పత్రిలో చేర్పించారు. ఈ సందర్భంగా ఓ అధికారి మాట్లాడుతూ.. ‘‘సదరు వ్యక్తి మానసిక వికలాంగుడు. సమీపంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఇక అతడు బాత్రూం గోడ కన్నంలోకి ఎందుకు వెళ్లాడనే విషయం అర్థం కావడం లేదు. బహుశా వెచ్చగా ఉంటుందని భావించి వెళ్లాడేమో’’ అని తెలిపాడు. 

చదవండి: అల్లు అర్జున్‌ కొత్త బిజినెస్‌: మహేష్‌కు పోటీగా!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top