విశాఖలో లెక్కల మాస్టారి తిక్కవేషాలు | Maths Teacher harrases girl student | Sakshi
Sakshi News home page

విశాఖలో లెక్కల మాస్టారి తిక్కవేషాలు

Feb 1 2014 7:10 PM | Updated on Sep 2 2017 3:15 AM

చిన్నారులపై కీచకల పరంపర కొనసాగుతోంది. విద్య నేర్పాల్సిన గురువులే దారితప్పి ప్రవర్తిస్తున్నారు. కీచక టీచర్ల ఆగడాలకు అంతులేకుండా పోతోంది.

విశాఖపట్నం: చిన్నారులపై కీచకల పరంపర కొనసాగుతోంది. విద్య నేర్పాల్సిన గురువులే దారితప్పి ప్రవర్తిస్తున్నారు. కీచక టీచర్ల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. తాజాగా విశాఖ జిల్లాలో 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిని లెక్కల మాస్టారు వేధింపులకు పాల్పడుతున్న ఘటన ఊర్వశి జంక్షన్లోని న్యూటన్ స్కూల్లో చోటుచేసుకుంది.

 

విద్యార్థిని కీచక మాస్టర్ వేధింపులు భరించలేక చివరికి మాస్టర్ గారి తిక్కవేశాల గురించి తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు, స్థానికుల సహాయంతో కీచక టీచర్కు దేహశుద్ధి చేశారు. విద్యార్ధులపై వేధింపులకు గురిచేసిన టీచర్పై చర్య ఎందుకు తీసుకోలేదంటూ పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు. అయినా స్కూలు యాజమాన్యం పట్టించుకోవటం లేదంటూ వారు ఆరోపిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement