పెళ్లైన ఆరు నెలలకే.. | married woman committed suicide in Nuzvid | Sakshi
Sakshi News home page

పెళ్లైన ఆరు నెలలకే..

Jun 17 2018 1:29 PM | Updated on Jun 17 2018 1:29 PM

married woman committed suicide in Nuzvid - Sakshi

నూజివీడు : కుటుంబ సభ్యులను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్న యువతి పెళ్‌లైన ఆరు నెలలకే విగతజీవిగా మారిన ఘటన పట్టణంలోని బాపూనగర్‌లో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రాజస్థాన్‌ నుంచి వలస వచ్చిన కుటుంబానికి చెందిన ఖుష్బూ (19), బాపూనగర్‌కు చెందిన రేపాని రాజు ప్రేమించుకుని గతేడాది డిసెంబరు నెలాఖరులో వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి ఖుష్బూ భర్త ఇంటి వద్దనే ఉంటోంది. ఇద్దరూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

 ఈ క్రమంలో వద్దన్నా వినకుండా తమ కుమార్తె ప్రేమ వివాహం చేసుకుందనే బాధతో కుష్బూ తల్లిదండ్రులు నూజివీడు నుంచి గుంటూరు జిల్లా పిడుగురాళ్ల ప్రాంతానికి వెళ్లిపోయారు. అయితే శనివారం మధ్యాహ్నం వరకు భార్యాభర్తలు ఇరువురూ పనికి వెళ్లి వచ్చారు. ఆ తర్వాత భర్త సెంటర్‌కు రాగా, భార్య రెండు మూడు సార్లు ఫోన్‌ చేసింది. దీంతో 3 గంటల ప్రాంతంలో ఇంటికి వెళ్లగా ఖుష్బూ చీరతో ఉరి వేసుకుని ఉండటంతో వెంటనే రాజు ఇరుగుపొరుగు వారిని పిలిచి కిందకు దించి ఆసుపత్రికి తరలించాడు. 

అయితే, అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు నిర్థారించారు. ఘటనపై పట్టణ ఎస్‌ఐ రంజిత్‌కుమార్‌ అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోస్ట్‌మార్టం రిపోర్టును బట్టి తర్వాత సెక్షన్‌లు మారుస్తామని ఎస్‌ఐ తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement