వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 230వ రోజు(జిల్లాలో 15వ రోజు) కార్యక్రమ వివరాలను ప్రోగ్రాం...
మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు సాగేదిలా
Aug 4 2013 5:13 AM | Updated on Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 230వ రోజు(జిల్లాలో 15వ రోజు) కార్యక్రమ వివరాలను ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, వైఎస్‌ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియలు శనివారం ప్రకటించారు. ఆదివారం ఉదయం గుడ్డిభద్ర గ్రామ సమీపంలోని బస నుంచి ప్రారంభమయ్యే షర్మిల పాదయాత్ర.. బలరాంపురం, సవరదేవిపేట, అయ్యవారిపేట, లొద్దపుట్టి గ్రామాల మీదుగా సాగుతుంది. భోజన విరామం తర్వాత షర్మిల.. ఇచ్ఛాపురం పట్టణానికి చేరుకుంటారు. అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.
జిల్లాలో 15వ రోజు పర్యటించే ప్రాంతాలు
బలరాంపురం, సవరదేవిపేట, అయ్యవారిపేట, లొద్దపుట్టి, ఇచ్ఛాపురం
Advertisement
Advertisement