మామి‘ఢీ’లా 

Mango Farmers Loss With Cyclone Nellore - Sakshi

వేసవి కాలం ప్రత్యేకం. రుచిలో మధురాతి మధురం. ఈ ఫలరాజం నమ్ముకున్న అన్నదాతకు లాభాల మాధుర్యాన్ని చవి చూపించే సందర్భాలు ఏటా ఉండవు. ఒక ఏడాది కాపునిస్తే మరో ఏడాది పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుంది. ఈ దఫా జిల్లాలో మామిడి సాగు కష్టంగా మారింది. తీవ్ర వర్షాభావంతో మామిడి తోటలు నిలువునా ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటి పోయి తడులు తడిపే పరిస్థితి లేదు. ట్యాంకర్లు ద్వారా నీరు పోయాలన్నా దొరకని పరిస్థితి. అధిక వ్యయం భరించలేని స్థితిలో రైతన్న కూరుకుపోయాడు. జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాల మామిడి తోటలు కళ్ల ముందే ఎండుపోతుంటే.. రైతులు కన్న ఆశలు అడియాసలవుతున్నాయి. ఆదుకోవాల్సిన ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. 

ఉదయగిరి: జిల్లాలో 25 వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ఒకప్పుడు మామిడి సాగు లాభాసాటిగా ఉండేది. రానురాను వర్షాలు తగ్గిపోవడంతో వర్షాధారంపై ఆధార పడడంతో ఈ సాగులో ప్రతికూల ఫలితాలు ఎదురవుతున్నాయి. నీరులేక తోటలు ఎండిపోయి రైతులు నష్టాలపాలయ్యారు. మూడేళ్లుగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పరిస్థితి దయనీయంగా మారింది. చుక్క నీరులేక తోటలు ఎండిపోతున్నాయి. మొదట రెండేళ్లు కొంత మేర తోటలను కాపాడుకున్న రైతులు ఈ ఏడాది మరింత దుర్భిక్షం నెలకొనడంతో తడులు అందించే పరిస్థితి కూడా కనిపించడం లేదు. 40 ఏళ్ల పాటు ఫలసాయం అందించే మామిడి తోటలు పట్టుమని పదేళ్లు కూడా గడవక ముందే ఎండిపోతున్నాయి. మామిడినే నమ్ముకున్న అనేక కుటుంబాలు ఆర్థిక కష్టాల్లో చిక్కుకొని విలవిల్లాడుతున్నాయి.

భారంగా మారిన తోటల పెంపకం
 జిల్లాలో 10 వేల హెక్టార్లులో మామిడి తోటలు ఉన్నాయి. ముఖ్యంగా కావలి, ఉదయగిరి, నాయుడుపేట, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాలోని పలు మండలాల్లో తోటలు సాగులో ఉన్నాయి. ముఖ్యంగా మెట్ట ప్రాంతంలో తోటలు నిలువునా ఎండుతున్నాయి. కలిగిరి, వింజమూరు, జలదంకి, ఆత్మకూరు, ఏఎస్‌ పేట, 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top