మంద కృష్ణమాదిగ అరెస్ట్ అన్యాయం | manda Krishnamadigaunfair arrest | Sakshi
Sakshi News home page

మంద కృష్ణమాదిగ అరెస్ట్ అన్యాయం

May 31 2016 4:18 AM | Updated on Sep 4 2017 1:16 AM

మంద కృష్ణమాదిగ అరెస్ట్ అన్యాయం

మంద కృష్ణమాదిగ అరెస్ట్ అన్యాయం

విజయవాడలో విలేకరుల సమావేశానికి వెళ్తున్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగను అరెస్ట్.....

దుత్తలూరు: విజయవాడలో విలేకరుల సమావేశానికి వెళ్తున్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగను అరెస్ట్ చేయడం దారుణమని ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి శ్రీనివాస మాదిగ పేర్కొన్నారు. మంద కృష్ణ మాదిగ అరెస్ట్‌ను నిరసిస్తూ స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎమ్మార్పీఎస్ నాయకులు సోమవారం కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరెస్ట్‌లతో ఎస్సీవర్గీకరణ ఉద్యమాన్ని ఆపలేరన్నారు. ఎమ్మార్పీఎస్  రాష్ట్ర నాయకులు యద్దనపూడి రమణయ్య, నియోజకవర్గ అధికార ప్రతినిధి గొల్లపల్లి మోహన్‌రావు, జిల్లా ప్రచార కార్యదర్శి ఇలారి దేవదాసు, మండల ఇన్‌చార్జి కే మనోజ్, ప్రధాన కార్యదర్శి విజయ్, బొజ్జా వెంకటసుబ్బమ్మ పాల్గొన్నారు.


 ఎన్టీఆర్ విగ్రహం ఎదుట నిరసన
కావలి అర్బన్: మంద కృష్ణ మాదిగ అరెస్టుకు నిరసనగా ఎమ్మార్పీఎస్ నాయకులు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సెం టర్  నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం విగ్రహం ఎదుట నిరసన తెలిపారు.  ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ రాస్ట్ర నేత  వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎన్నికల హామీ మేరకు ఎస్సీ వర్గీకరణ చేపట్టకుంటే  తీవ్రపరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఎమ్మార్పీఎస్ నాయకులు అక్కిలగుంట మార్టిన్ సుధాకర్ మాదిగ, మంద వెంకటేశ్వర్లు మాదిగ, చేవూరు మాల్యాద్రి మాదిగ, ఎలికా చంద్రశేఖర్ మాదిగ, మహేంద్ర మాదిగ, చంద్రశేఖర్, మోజెస్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement