నడుస్తున్న బస్సులోంచి దూకి ఆత్మహత్య | man suicide in running bus | Sakshi
Sakshi News home page

నడుస్తున్న బస్సులోంచి దూకి ఆత్మహత్య

Oct 27 2015 8:14 AM | Updated on Nov 6 2018 7:56 PM

వేగంగా వెళ్తున్న బస్సులో నుంచి కిందికి దూకి ఓ వ్యక్తి ప్రాణం తీసుకున్న ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది.

గూడూరు: వేగంగా వెళ్తున్న బస్సులో నుంచి కిందికి దూకి ఓ వ్యక్తి ప్రాణం తీసుకున్న ఘటన  శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో మంగళవారం ఉదయం  చోటుచేసుకుంది.  ప్రకాశం జిల్లా కందుకూరు మండలం జరుగుమల్లి గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి(35) బెంగళూరు కేఆర్‌పురంలో టీ దుకాణం నడుపుకుంటూ జీవిస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. గత కొంతకాలంగా అతడు మద్యానికి బానిసయ్యాడు.

ఒంగోలులోని పోలేరమ్మ గుడిలో తాయెత్తు కట్టుకుంటే మద్యం మానేయవచ్చనే కుటుంబసభ్యుల సలహా మేరకు స్నేహితుడు మునిరాజాతో కలసి సోమవారం రాత్రి బెంగళూరు నుంచి బయలుదేరాడు. వారు ప్రయాణిస్తున్న బస్సు నెల్లూరు జిల్లా గూడూరు జాతీయరహదారిపై పంటలేరు బ్రిడ్జి వద్ద ఉండగా అకస్మాత్తుగా తన సీట్లోంచి లేచి, బస్సు డోరు తీసుకుని బయటకు దూకేశాడు. తలకు తీవ్రగాయాలు కావటంతో సుబ్బారెడ్డి అక్కడికక్కడే మరణించాడు. గూడూరు పోలీసులు మునిరాజాను అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement