విజయవాడలో దారుణం.. పెట్రోల్‌ పోసి నిప్పంటించారు | Man set on fire in Vijayawada in broad daylight | Sakshi
Sakshi News home page

విజయవాడలో దారుణం.. పెట్రోల్‌ పోసి నిప్పంటించారు

Nov 23 2018 3:47 PM | Updated on Nov 24 2018 9:12 AM

Man set on fire in Vijayawada in broad daylight - Sakshi

సాక్షి, విజయవాడ : విజయవాడలో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. దేవరపల్లి గగారిన్ అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోలు పోసి నిప్పంటించారు. విజయవాడలోని గవర్నర్ పేట సమీపంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఫైనాన్స్ వ్యాపారులతో వివాదమే ఘాతుకానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. దాడిలో తీవ్రంగా గాయపడిన గగారిన్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గగారిన్‌కు 90 శాతం కాలిన గాయాలయ్యాయని, 48 గంటలు గడిస్తేగాని ఏమీ చెప్పలేమని డాక్టర్‌ రామారావు తెలిపారు. ఉదరభాగం నుంచి క్రిందకు ఎక్కువ శాతం శరీరం కాలిందన్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.

రవితేజ ఫైనాన్స్ వ్యాపారి గగారిన్ పై గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు పెట్రోల్ లేదా కిరోసిన్ పోసి నిప్పంటించారని, ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని నార్త్ ఏసీపీ రమణ మూర్తి అన్నారు. ఇద్దరు దుండగులు పెట్రోల్‌ పోసి తగులబెట్టారని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. 'స్థానికులు స్పందించి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. ప్రాణం పోతోంది కాపాడమని, ఆస్పత్రికి తీసుకెళ్లమని ధీనంగా అడిగాడు. ఆటోలో ఎక్కించుకుని ఆస్పత్రికి తరలించారు' అని ప్రత్యక్ష సాక్షి చెప్పారు. తనపై పెట్రోలు పోసి అంటించింది మాదాల సురేశ్‌, మాదాల సుధాకర్‌ అని చెప్పినట్టు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement