భార్య నుంచి విడదీశారని సెల్‌ టవర్‌ ఎక్కి..

Man Climbs Cell Tower in Prakasham District - Sakshi

సాక్షి, ఒంగోలు: ప్రకాశం జిల్లా అన్నముబొట్లవారిపాలెంలో సెల్‌టవర్‌ ఎక్కి ఓ యువకుడు హల్‌చల్‌ చేశాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని తన నుంచి విడదీసి.. అక్రమ కేసు పెట్టారని అతను ఆరోపిస్తున్నాడు. తాను పెళ్లి చేసుకున్న యువతిని తనతోపాటు పంపించేవరకు సెల్‌టవర్‌ దిగేది లేదని పట్టుబట్టాడు. అన్నముబొట్లవారిపాలెంకు చెందిన యువతి గుంటూరులో చదువుకుంటుడగా... ఆటో నడుపుకుంటున్న నామాల చందుతో పరిచయం అయ్యింది. వీరి పరిచయం ప్రేమగా మారడంతో... పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లైన నెల తర్వాత యువతి తాను మోసపోయానంటూ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చేసిందని స్థానికులు చెప్తున్నారు. చందూపై పర్చూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందని సమాచారం. ఈ క్రమంలో చందూ రాత్రి అన్నముబొట్లవారిపాలెంలోని యువతి ఇంటికి వచ్చి.. ఆమె తల్లిదండ్రులతో గొడవపడ్డాడని చెప్తున్నారు. చుట్టపక్కవారు వచ్చేసరికి అక్కడినుంచి పరారయ్యాడని, ఈ క్రమంలోనే ఇప్పుడు మళ్లీ సెల్‌టవర్‌ ఎక్కి చందూ గొడవ చేస్తున్నాడని యువతి బంధువులు మండిపడుతున్నారు. పర్చూరు పోలీసులు యువకుడికి నచ్చజేపే ప్రయత్నం చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top