
మలేసియా విమానం(ఫైల్ ఫోటో)
శంషాబాద్ ఎయిర్ పోర్టులో మలేసియా విమానం నిలిచిపోయింది. మలేసియాకు చెందిన ఎంహెచ్ 199 విమానం సాంకేతిక కారణాలతో ఆగిపోయింది.
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో మలేసియా విమానం నిలిచిపోయింది. మలేసియాకు చెందిన ఎంహెచ్ 199 విమానం సాంకేతిక కారణాలతో ఆగిపోయింది. దీంతో 3 గంటలు ఆలస్యంగా విమానం కౌలాలంపూర్ కు బయలుదేరనుంది.
ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్టు విమానశ్రయ సిబ్బంది తెలిపారు. విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్యను సరిదిద్దేందుకు నిపుణుల బృందం ప్రయత్నిస్తోంది.