breaking news
Malaysia flight
-
విమానం అదృశ్య కథ
తమిళసినిమా: గత ఏడాది ప్రయాణికులతో బయలుదేరిన మలేషియా విమానం అదృశ్యమై పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటన నేటికీ మిస్టరీగానే ఉంది. ఆ మలేషియా విమానం నేపథ్యంలో ఒక భారీ చిత్రం తెరకెక్కనున్నట్లు తాజా సమాచారం. అంతేకాదు విశ్వనాయకుడు కమలహాసన్. సంచలన నృత్య దర్శకుడు, నటుడు, దర్శకుడు ప్రభుదేవాల కలయికలో ఒక క్రేజి చిత్రం తెరకెక్కనుందనే వార్తను ఇంతకుముందే వెల్లడించారు. ఆ సరికొత్త కలయికలో తెరకెక్కనున్న సంచలన చిత్రం ఇదేనన్నది తాజా సమాచారం. ఈ చిత్రం కోసం లొకేషన్ ఎంపిక చేయడానికి కమలహాసన్ మారిషస్ వెళ్లారు. ప్రభుదేవా కూడా వెళ్లాల్సి వున్నా ఆయన హిందీ చిత్రం సింగ్ ఈజ్ కింగ్ చిత్ర షూటింగ్లో బిజీగా ఉండడం వలన వెళ్లలేకపోయినట్లు తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన మరో విషయం ఒక సంచలన నవల కాన్సెప్ట్‌ను తీసుకుని కమలహాసన్ స్వయంగా కథ, కథనం తయారు చేస్తున్నట్లు సమాచారం. కమల్, ప్రభుదేవా కాంబినేషన్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో పూర్తి చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. కమల్ ప్రస్తుతం ఉత్తమ విలన్, పాపనాశం, విశ్వరూపం-2 వంటి మూడు చిత్రాలను పూర్తి చేశారు. ఇవి వరుసగా విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ప్రభుదేవా సింగ్ ఈజ్ కింగ్ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో వున్నారు. దీంతో వీరి కలయికలో తెరకెక్కనున్న చిత్రాన్ని ఏప్రిల్‌లో సెట్‌పైకి తీసుకెళ్లి వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేయడానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రంలో తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఫాలోయింగ్ ఉన్న నటిని హీరోయిన్గా ఎంపిక చేసే పనిలో చిత్ర యూనిట్ ఉన్నట్లు కోలీవుడ్ టాక్. -
నిలిచిపోయిన మలేసియా విమానం
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో మలేసియా విమానం నిలిచిపోయింది. మలేసియాకు చెందిన ఎంహెచ్ 199 విమానం సాంకేతిక కారణాలతో ఆగిపోయింది. దీంతో 3 గంటలు ఆలస్యంగా విమానం కౌలాలంపూర్ కు బయలుదేరనుంది. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్టు విమానశ్రయ సిబ్బంది తెలిపారు. విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్యను సరిదిద్దేందుకు నిపుణుల బృందం ప్రయత్నిస్తోంది. -
మలేషియా విమాన శకలాల గాలింపునకు అడ్డంకులు
కౌలాలంపూర్ : మలేషియా విమాన శకలాల గాలింపునకు వాతావరణం అనుకూలంగా లేదని మలేషియా ప్రభుత్వం తెలిపింది. వాతావరణం ప్రతికూలంగా ఉండటం వల్ల పూర్తి సమాచారాన్ని తెలుసుకోలేకపోతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. విమానం ఎక్కడ, ఎలా కూలిపోయిందీ ఈ రోజు సమాచారం ఇస్తామని మలేషియా ప్రభుత్వం తెలిపింది. తప్పిపోయిన మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం ఎంహెచ్ 370 కూలిపోయిందని ఆ ప్రభుత్వం నిన్న నిర్ధారించిన విషయం తెలిసిందే.(వీడిన మలేషియా విమానం మిస్టరీ) కౌలాలంపూర్ నుంచి 227 మంది ప్రయాణికులు 12 మంది సిబ్బందితో చైనా రాజధాని బీజింగ్ బయలుదేరిన ఈ విమానం ఈ నెల 8న అదృశ్యమైంది.16 రోజుల తరువాత కూలిపోయినట్లు తెలిసింది. అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు. విమానం కూలిపోయిన ప్రదేశానికి వెళ్లి, శకలాలను పరిశీలించి వివరాలు సేకరించడానికి వాతావరణం అనుకూలంగాలేదు. ఈ రోజు సాయంత్రానికి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.