మహారాష్ట్ర ఎన్నికల పరిశీలకులుగా 'తెలుగు నేతలు' | Maharashtra Assembly Elections observers appointed by AICC | Sakshi
Sakshi News home page

మహారాష్ట్ర ఎన్నికల పరిశీలకులుగా 'తెలుగు నేతలు'

Sep 25 2014 9:57 AM | Updated on Oct 8 2018 6:02 PM

మహారాష్ట్ర ఎన్నికల పరిశీలకులుగా 'తెలుగు నేతలు' - Sakshi

మహారాష్ట్ర ఎన్నికల పరిశీలకులుగా 'తెలుగు నేతలు'

మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికలు సమీపిస్తున్నాయి.

న్యూఢిల్లీ: మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ఎన్నికల పరిశీలకులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు  సీనియర్ నేతలను ఎంపిక చేసినట్లు ఏఐసీసీ గురువారం వెల్లడించింది. తెలంగాణ నుంచి ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్, మాజీ ఎంపీలు వివేక్, మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్లను ఎంపిక చేసినట్లు తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి మాజీ ఎంపీ బోత్స ఝాన్సీతోపాటు కేంద్ర మాజీ మంత్రులు కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, కిల్లి కృపారాణి, కిషోర్ చంద్రదేవ్, పళ్లంరాజు లను ఎంపిక చేసినట్లు ఏఐసీసీ ప్రకటించింది.

288 మంది సభ్యులు గల మహారాష్ట్ర శాసనసభకు వచ్చే నెల 15న ఎన్నికలు జరగనున్నాయి. అందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఎన్నికల సంఘం ఇప్పటికే జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధిక శాసనసభ స్థానాలు కైవసం చేసుకోవాలని ఇప్పటికే పలు పార్టీలు దృష్టి సారించాయి. అందులోభాగంగా ప్రధాన పార్టీలు వివిధ పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement