గ్రేటర్లో విలీనానికి నిరసిస్తూ నార్సింగ్లో మహాధర్నా | Mahadarna at narsingi village | Sakshi
Sakshi News home page

గ్రేటర్లో విలీనానికి నిరసిస్తూ నార్సింగ్లో మహాధర్నా

Sep 14 2013 11:20 AM | Updated on Aug 21 2018 12:21 PM

నగర శివారుల్లోని 17 గ్రామ పంచాయితీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడంపై అయా గ్రామాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నగర శివారుల్లోని 17 గ్రామ పంచాయితీలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్లో విలీనం చేయడంపై అయా గ్రామాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ నేపథ్యాన్ని పురస్కరించుకుని అయా గ్రామాల ప్రజలు శనివారం నార్సింగ్లో మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నార్సింగ్ పరిసర ప్రాంతాల్లో దుకాణదారులు తమ దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు.

 

అలాగే పాఠశాలను కూడ మూసివేశారు. ఆ బంద్కు మద్దతుగా 17 గ్రామాలకు చెందిన ప్రజలు భారీ సంఖ్యలో శనివారం ఉదయం నార్సింగ్ చేరుకుని మహాధర్నాలో పాల్గొన్నారు. అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా భారీగా పోలీసు బలగాలను మెహరించారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement