ఒకే కుటుంబం..ముగ్గురుమంత్రులు

Maganti Family Is Famous For Ministry In West Godavari - Sakshi

సాక్షి, కొవ్వూరు :  జిల్లా రాజకీయాల్లో మాగంటి కుటుంబం దశాబ్దాల నుంచి ఉంది. తల్లిదండ్రులు, తనయుడు ముగ్గురూ మంత్రులుగా అవకాశం దక్కించుకున్న ఆరుదైన ఘనత వీరికి సొంతం. మాగంటి రవీంద్రనాథ్‌ చౌదరి జెడ్పీ చైర్మన్‌గా, 1989లో చెన్నారెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. 1991 ఉప ఎన్నికల్లో ఆయన భార్య వరలక్ష్మి గెలుపొంది స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. వారి కుమారుడు మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) 2004లో వైఎస్సార్‌ ప్రభంజనంలో ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా చేశారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఏలూరు ఎంపీగా ఆయన గెలుపొందారు. ఇలా ఒకే కుటుంబంలో ముగ్గురు రాష్ట్ర మంత్రులు పనిచేయడం మాగంటి కుటుంబం ప్రత్యేకం.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top