
తణుకు అర్బన్: చికెన్, మటన్ ధరలు దిగిరావడంతో మాంసాహారులు లొట్టలేసుకుం టూ లాగించేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ రెండు రకాల మాంసం ధరలు కొండెక్కి కూర్చోవడంతో మాంసాహార ప్రియులు కొనుగోళ్లకు కొంచెం వెనకాడే పరిస్థితి నెల కొంది. కానీ నేడు వ్యాపారుల మధ్య వచ్చిన పోటీ తదితర కారణాలతో చికెన్ బ్రాయిలర్ ధర కిలో రూ.159, మటన్ కిలో రూ.800 తమ దుకాణాల ముందు కొందరు వ్యాపా రులు ప్లెక్సీలు ఏర్పాటుచేసి విక్రయాలు చేస్తుండడంతో మాంసాహారులు ఉత్సాహంగా కొనుగోళ్లకు సిద్ధమవుతున్నారు.
ఉత్పత్తి ఎక్కువ.. వాడకం తక్కువ
చికెన్ ఉత్పత్తి అధికంగా ఉండడంతో మేత ధరలు పెరగడంతో హోల్సేల్లో కోడి లైవ్ ధర విపరీతంగా తగ్గిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవ రిలో బర్డ్ ఫ్లూ విలయ తాండవం అనంతరం చికెన్ కిలో ధర రూ.280 వరకు ఎగబాకిం ది. కానీ నేడు ఉత్పత్తి భారీగా రావడం, అమ్మకాలు తగ్గడంతో ధర తగ్గించి అమ్మ కాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నేడు చికెన్ ఉత్పత్తి భారీగా నిల్వ ఉండడంతో హోల్సేల్ లైవ్ ధర రూ.80కి పడిపోయింది. దీంతో రిటైల్ వ్యాపారుల్లో కొందరు బాయిలర్ లైవ్ ధర రూ.99, కిలో ధర రూ.159 అమ్మకాలు చేస్తున్నారు. చికెన్ ప్రియులు గతం కంటే రెండింతలు మాం సం కొనుగోలు చేస్తున్నారు. ఇక మటన్ ధర పట్టణ పరిధిలో అధిక శాతం దుకాణాల వద్ద రూ.800 ఫ్లెక్సీలు పెట్టి విక్రయిస్తున్నారు. ఇక గ్రామాల్లో అయితే రూ.600 ఫ్లెక్సీలు పెట్టి విక్రయిస్తున్నట్లుగా తెలుస్తోంది. బర్డ్ ఫ్లూ సోకిన సమయంలో మటన్ విక్రయాలు విపరీతంగా పెరగడం తో అప్పట్లో రూ.1000 నుంచి రూ.1200 వరకు పెంచి అమ్మకాలు చేశారు.
జీవాల ఉత్పత్తి పెరగడం, దానికి తోడు అమ్మకాలు నీరసంగా ఉండడంతో నేడు మటన్ వ్యాపా రులు భారీగా ధర తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాంసాహారులు భలే ఛాన్సులే అనుకుంటూ గతంలో అరకేజీ కొనుగోలు చేసే వారు సైతం నేడు కిలోకి పైగా కొను గోలు చేస్తున్నారు. మటన్ విక్రయాలకు సంబంధించి జీవాల శాతం పెరగడంతో పాటు పోషణ భారంగా మారిన పరిస్థి తుల్లో ధరలు తగ్గించి అమ్మకాలు పెంచా అనే ఉద్దేశ్యంతో వ్యాపారులు ఉన్నట్లు తెలువీరభద్రపురంలో బాయిలర్ కోడి మాంసం ధర తెలిపే ఫ్లెక్సీస్తోంది. వర్షాకాలం కావడంతో జీవాలను అధికంగా పెట్టుకున్నా పలు రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉండడంతో తక్కువ ధరలకు విక్రయాలు చేస్తున్నట్లుగా వ్యాపారులు చెబుతున్నారు.
పోటాపోటీగా ప్లెక్సీలు
చికెన్, మటన్ ధరలకు సంబంధించి తణుకు ఇతర పట్టణాల్లో పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మరీ అమ్మకాలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం వ్యాపారుల మధ్య పోటీ పెరిగి ఈ తరహా విక్రయాలు చేస్తున్నారని అతి కొద్ది రోజుల్లో రిటైల్ వ్యాపారులు సమావేశమై తిరిగి హోల్ సేల్ ధరలకు సంబంధం లేకుండా సిండికేట్గా మారి ధరలు పెంచి విక్రయాలు చేసేందుకు కార్యాచరణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.