వైఎస్సార్‌సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి శనివారం బోగోలు, కావలి, దగదర్తి మండలాల్లో సాగునీరు లేక ఎండిన పంట పొలాలను పరిశీలిస్తారని పార్టీ కావలి నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
కావలి, న్యూస్‌లైన్: వైఎస్సార్‌సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి శనివారం బోగోలు, కావలి, దగదర్తి మండలాల్లో సాగునీరు లేక ఎండిన పంట పొలాలను పరిశీలిస్తారని పార్టీ కావలి నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
కావలి రూరల్ మండలం గౌరవరం, సర్వాయపాళెం, బోగోలు పాతబిట్రగుంట, దగదర్తి మండలంలో ఆయన పర్యటన ఉంటుందన్నారు. రైతుల కష్టాలను తెలుసుకుని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తారని వివరించారు.