అనంతపురంలో దారుణం జరిగింది.
అనంతపురం: అనంతపురంలో దారుణం జరిగింది. ప్రేమోన్మాది ఓ విద్యార్థినిపై యాసిడ్ దాడి చేసి ఘాతుకానికి పాల్పడ్డాడు. రాఘవ అనే యువకుడు డిగ్రీ విద్యార్ధిని వాణి తనని ప్రేమించడం లేదని ఆ విద్యార్థినిపై యాసిడ్‌తో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది.
రాఘవ తనని ప్రేమించాలంటూ ముదిగుబ్బకు చెందిన వాణి వెంటపడ్డాడు. అందుకు ఆమె అంగీకరించలేదు. దీంతో గతంలో ఓసారి వాణి ముదిగుబ్బ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రాఘవను హెచ్చరించి విడిచిపెట్టారు. ఈరోజు మళ్లీ వెంటపడి ఎన్ హెచ్ 44 బళ్లారి రోడ్డులో వాణి వెళుతుండగా శరీరంపై యాసిడ్ పోశాడు. ఆ తరువాత రాఘవ పరారయ్యాడు.