బైక్‌ను ఢీకొట్టిన లారీ : ఇద్దరి దుర్మరణం | lorry collided bike two died in anantapur district | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొట్టిన లారీ : ఇద్దరి దుర్మరణం

Jan 30 2016 4:55 PM | Updated on Aug 25 2018 6:06 PM

అనంతపురం జిల్లాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు.

హిందూపురం: అనంతపురం జిల్లాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. హిందూపురం మండలం కొత్నూరు గ్రామ సమీపంలో వేగంగా వెళ్తున్న లారీ, బైక్ను ఓవర్‌టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి బోల్తా కొట్టింది.

ఈ ఘటనలో అనంతపురం నుంచి హిందూపురం బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు పరిగి మండలం గొల్లపల్లికి చెందిన హనుమంతరాయుడు(19), తిప్పన్న(38)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement