పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పోలీసుల కస్టడీలో ఉన్న ఓ నిందితుడు నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
జంగారెడ్డిగూడెం : పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పోలీసుల కస్టడీలో ఉన్న ఓ నిందితుడు నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మోటార్ సైకిళ్ల దొంగతనం కేసులో జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురానికి చెందిన మారిశెట్టి రాజేష్(28)ను కొన్ని రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. లాకప్‌లో ఉన్న రాజేష్ శనివారం ఉదయం అందులోనే వున్న బైక్‌లలోని పెట్రోల్ తీసుకుని ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు.
75 శాతం కాలిన గాయాలైన రాజేష్‌ను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. పోలీసుల చిత్రహింసలకు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేశానని అతను వాంగ్మూలం ఇచ్చినట్టు తెలిసింది. కానీ, తమను బెదిరించటానికని ఆత్మహత్యాయత్నం చేశాడని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసినట్లు ఎస్పీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.