పట్టిసీమ ఎత్తిపోతలకు రూ.1,250 కోట్లు | Sakshi
Sakshi News home page

పట్టిసీమ ఎత్తిపోతలకు రూ.1,250 కోట్లు

Published Sat, Dec 20 2014 4:55 AM

Lift that time crore to Rs .1,250

సాక్షి, హైదరాబాద్: పోలవరం, గూటాల మధ్య పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మా ణం అవసరమేనని మంత్రులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. నిర్మాణం చేపట్టిన ఏడాదిలోగా పూర్తి చేస్తామన్నారు. శుక్రవా రం అసెంబ్లీ లాబీల్లో మంత్రులు వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. గోదావరిపై పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి రూ. 1,250 కోట్లు ఖర్చవుతుందని యనమల చెప్పారు.

రాష్ర్టం విడిపోక ముందు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చు చేసిన రూ. 5,000 కోట్లు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని తెలిపారు. గతంలో ఖర్చు పెట్టిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని తాము కోరినా కేంద్రం తిరస్కరించిందన్నారు. గోదావరి జలాల విషయంలో వైఎస్సార్‌సీపీ అనవరంగా రాజ కీయం చేస్తోందని విమర్శించారు. ఎత్తిపోతల పథకాన్ని పనులు ప్రారంభించిన ఏడాదిలోగా పూర్తి చేస్తామని మంత్రి దేవినేని తెలిపారు.

Advertisement
Advertisement