‘టీడీపీ మహానాడును అడ్డుకుంటాం’ | left parties leaders slams chandrababu over farmers issue | Sakshi
Sakshi News home page

‘టీడీపీ మహానాడును అడ్డుకుంటాం’

May 16 2017 7:14 PM | Updated on Jun 4 2019 5:16 PM

‘టీడీపీ మహానాడును అడ్డుకుంటాం’ - Sakshi

‘టీడీపీ మహానాడును అడ్డుకుంటాం’

రైతులు, వ్యవసాయ కూలీల కష్టాలు తీర్చకుంటే టీడీపీ మహానాడును అడ్డుకుంటామని సీపీఎం ఏపీ కార్యదర్శి మధు హెచ్చరించారు.

అనంతపురం: రైతులు, వ్యవసాయ కూలీల కష్టాలు తీర్చకుంటే టీడీపీ మహానాడును అడ్డుకుంటామని సీపీఎం ఏపీ కార్యదర్శి మధు హెచ్చరించారు. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు పన్నురాయితీ కల్పించిన సీఎం చంద్రబాబు రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. చంద్రబాబుది మోచేతి నీళ్లు తాగే రకమని, ఆయనను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించకూడదని అన్నారు.

విదేశీ పర్యటనలు, పుష్కరాలకు వేల​ కోట్ల నిధులు ఖర్చు పెట్టిన చంద్రబాబుకు కరువు రైతులను ఆదుకోవడం తెలియదా అని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ అని ప్రశ్నించారు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురంలో రెండు వారాలకు ఒకసారి సాగునీరు ఇవ్వడం సిగ్గుచేటని మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement