కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు మరోసారి సమావేశమైంది. వాటర్ బోర్డు చైర్మన్ ఎస్‌కేజీ పండిత్ నేతృత్వంలో ఎర్రమంజిల్...
హైదరాబాద్ : కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు మరోసారి సమావేశమైంది. వాటర్ బోర్డు చైర్మన్ ఎస్‌కేజీ పండిత్ నేతృత్వంలో ఎర్రమంజిల్లోని జలసౌధలో గురువారం భేటీ అయ్యింది. ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ అధికారులు, సలహాదారులు హాజరయ్యారు. కాగా శ్రీశైలం జలాశయం నుంచి నీటి వినియోగ అంశంపై మధ్యేమార్గంలో వెళ్లాల్సిందిగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు సూచించింది. అయితే ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవటంతో బోర్డు మళ్లీ సమావేశమైంది.