'జగన్ పర్యటిస్తుంటే... వాళ్లకెందుకు బాధ' | Kodali Nani takes on chandrababu and | Sakshi
Sakshi News home page

'జగన్ పర్యటిస్తుంటే... వాళ్లకెందుకు బాధ'

Mar 3 2015 6:28 PM | Updated on May 25 2018 9:20 PM

'జగన్ పర్యటిస్తుంటే... వాళ్లకెందుకు బాధ' - Sakshi

'జగన్ పర్యటిస్తుంటే... వాళ్లకెందుకు బాధ'

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమా చేస్తున్న ఆరోపణలను గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఖండించారు.

విజయవాడ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమా చేస్తున్న ఆరోపణలను గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఖండించారు. మంగళవారం విజయవాడలో కొడాలి నాని మాట్లాడుతూ.... బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారని తెలిపారు. తమ పార్టీ నాయకుడు రాజధాని ప్రాంతాల్లో పర్యటిస్తే టీడీపీ మంత్రులను ఎందుకు బాధ కలుగుతుందో తెలియడం లేదన్నారు.

నోరు అదుపులో పెట్టుకోవాలని చంద్రబాబు, దేవినేని ఉమాలకు ఈ సందర్బంగా కొడాలి నాని హితవు పలికారు. చంద్రబాబు పేరు చీటర్ బాబు, ఆయన బినామీ ఉమా అని కొడాలి నాని ఎద్దేవా చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement