కాంగ్రెస్ పార్టీని కిరణ్ మోసం చేశారు: కంతేటి | kiran kumar reddy betrayed congress party, says kantheti satyanarayana raju | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ పార్టీని కిరణ్ మోసం చేశారు: కంతేటి

Mar 10 2014 1:38 PM | Updated on Jul 29 2019 5:31 PM

మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని మోసం చేశారని ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు మండిపడ్డారు.

మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని మోసం చేశారని ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు మండిపడ్డారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం పార్టీని భ్రష్టు పట్టించిందని, కాంగ్రెస్‌లో గంజాయి మొక్కల సంఖ్య పెరుగుతోందని ఆయన విమర్శించారు. పార్టీలో కుల, మత , అవినీతి ప్రాబల్యం అధికమవుతోందని, పార్టీ సీమాంధ్ర నాయకత్వం కూడా విఫలమైందని ఆయన చెప్పారు.

ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ కష్టాల్లో ఉందని, గెలుపోటములతో సంబంధం లేకుండా నేతలు ఎన్నికల బరిలోకి దిగితేనే కాంగ్రెస్ బలపడుతుందని కంతేటి అన్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకాన్ని కిరణ్ కుమార్ రెడ్డి ఏడాది ఆలస్యం చేసి తప్పుచేశారని మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement