నియంతలా వ్యవహరించిన కిరణ్: గండ్ర | Kiran Kumar Reddy Behave like Dictator, says Gandra Venkataramana Reddy | Sakshi
Sakshi News home page

నియంతలా వ్యవహరించిన కిరణ్: గండ్ర

Jan 31 2014 10:32 AM | Updated on Jun 18 2018 8:10 PM

నియంతలా వ్యవహరించిన కిరణ్: గండ్ర - Sakshi

నియంతలా వ్యవహరించిన కిరణ్: గండ్ర

విభజన బిల్లుపై చర్చ సందర్భంగా శాసనసభలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహరించిన తీరు నియంతను తలపించిందని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు.

వరంగల్: విభజన బిల్లుపై చర్చ సందర్భంగా శాసనసభలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహరించిన తీరు నియంతను తలపించిందని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ఫిబ్రవరి 20లోగా ఆమోదం పొందుతుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. సాధారణ ఎన్నికలు తెలంగాణలోనే జరుగుతాయని అన్నారు. సోమవారం తామంతా ఢిల్లీకి వెళ్లనున్నట్టు చెప్పారు.

తెలంగాణ ప్రజలను మరింత రెచ్చగొట్టడానికే కిరణ్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కలసి కుట్ర చేస్తున్నారని అంతకుముందు ఆయన ఆరోపించారు. రాష్ట్ర విభజన విషయంలో అసెంబ్లీ అభిప్రాయాలను మాత్రమే చెప్పాలి తప్ప తిరస్కరించాలనుకోవడం సరికాదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement