‘దొంగఓట్లపై విచారణ జరిపించండి’

Kethireddy Venkata Rami Reddy Meets AP Chief Election Officer - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో దొంగఓట్లను అరికట్టి, స్వేచ్ఛగా, జవాబుదారీతనంతో, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆర్పీ సిసోడియాకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు, ఆ పార్టీ ముఖ్య నాయకులు సోమవారం ఎన్నికల ప్రధానాధికారిని కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఓట్ల గల్లంతు, ఓట్ల డూప్లికేషన్‌, దొంగ ఓట్లపై సమీక్షించాలని కోరామని తెలిపారు. తమ దగ్గర ఉన్న ఆధారాలను ప్రధానాధికారికి సమర్పించామని, రాష్ట్రంలో దాదాపు 34 లక్షల డూప్లికేషన్‌ ఓట్లు ఉన్నాయని వెల్లడించారు. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రెండు చోట్లా 18 లక్షల మంది ఓట్లు కలిగి ఉన్నారని ఆరోపించారు. వీటన్నింటిపై విచారణ జరిపించాలని కోరగా సీఈఓ సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top