తెలంగాణవారికి మాపై విపరీతమైన ద్వేషం | KE Krishnamurthy praises chandrababu naidu | Sakshi
Sakshi News home page

తెలంగాణవారికి మాపై విపరీతమైన ద్వేషం

Jul 12 2014 1:31 PM | Updated on Sep 2 2017 10:12 AM

తెలంగాణవారికి మాపై విపరీతమైన ద్వేషం

తెలంగాణవారికి మాపై విపరీతమైన ద్వేషం

తెలంగాణ వారికి ఆంధ్రా ప్రాంతవాసులపై విపరీతమైన ద్వేషం ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు.

విజయవాడ: తెలంగాణ వారికి ఆంధ్రా ప్రాంతవాసులపై విపరీతమైన ద్వేషం ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు. ఏపీ ఎన్జీవోల అభినందన సభలో ఆయన శనివారం మాట్లాడుతూ తమని ఎప్పుడెప్పుడు అక్కడ నుంచి తరుముదామా అని చూస్తున్నారన్నారు.


 మంత్రులన్న ఇంగిత జ్ఞానం లేకుండా విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అందరూ కష్టపడితేనే హైదరాబాద్ ఇంత స్థాయికి వచ్చిందని కేఈ అన్నారు. తెలంగాణవారు ఆశ్చర్యపడేలా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఆకాశంలో చంద్రుడు 12 గంటలు ప్రకాశిస్తే ....చంద్రబాబు నాయుడు 24 గంటలు ప్రకాశిస్తారని ఈ సందర్భంగా కేఈ కృష్ణమూర్తి  ప్రశంసలతో ముంచెత్తారు.

(ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement