' రాష్ట్ర విభజన10 శాతమే జరిగింది' | just 10 percent done on state bifurcation process, says murali krishna | Sakshi
Sakshi News home page

' రాష్ట్ర విభజన10 శాతమే జరిగింది'

Jan 15 2014 2:29 PM | Updated on Sep 27 2018 5:56 PM

రాష్ట్ర విభజన ప్రక్రియ పదిశాతమే జరిగిందని, ఇంకా 90 శాతం జరగాల్సి ఉందని సీమాంధ్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీ కృష్ణ వెల్లడించారు.

రాష్ట్ర విభజన ప్రక్రియ పదిశాతమే జరిగింద, ఇంకా 90 శాతం జరగాల్సి ఉందని సీమాంధ్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీ కృష్ణ వెల్లడించారు. బుధవారం గుంటూరు వచ్చిన ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... 2014 సార్వత్రిక ఎన్నికలు సమైక్య రాష్ట్రంలోనే జరుగుతాయని తెలిపారు.

 

తెలంగాణ ప్రత్యక రాష్ట్రం ఏర్పాటు అయితే కొత్త ఉద్యోగాలు వస్తాయని కొంత మంది అవకాశవాదులు నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు. అయితే రాష్ట్ర విభజనతో కొత్త ఉద్యోగాలు ఏర్పాటు కావని ఆయన అభిప్రాయపడ్డారు. కొత్త ఉద్యోగాలు వస్తాయనుకుంటే ఇప్పటికే విభజిన జరిగిన రాష్ట్రాలలో ఎంత మంది కొత్త ఉద్యోగాలు పొందారో  వెల్లడించాలని ఆయన అవకాశవాదులను డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement