
‘విభజన పేరుతో అహంకారంగా వ్యవహిరిస్తే సహించం’
రాష్ర్త విభజన పేరుతో అహంకారంగా వ్యవహరిస్తే సహించేది లేదని వైఎస్సార్‌సీపీ నేత జూపూడి ప్రభాకరరావు హెచ్చరించారు.
గుంటూరు: రాష్ట్ర విభజన పేరుతో ప్రభుత్వం అహంకారంగా వ్యవహరిస్తే సహించేది లేదని వైఎస్సార్‌సీపీ నేత జూపూడి ప్రభాకరరావు హెచ్చరించారు. ఈ నెల 26న నిర్వహిస్తున్న 'సమైక్య శంఖారావం' సభకు సమైక్యవాదులంతా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. విభజన పేరుతో అహంకారంగా వ్యవహరించడం ఎంతమాత్రం సరికాదని ఆయన సూచించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకూ జరిగిన పరిణామాలను వివరించేందుకే సమైక్య శంఖారావం సభను నిర్వహిస్తున్నట్లు జూపూడి తెలిపారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, రామోజీరావులు కలిసి ఆడుతున్న కుట్రలను బయటపెడతామన్నారు. సమైక్య శంఖారావానికి సమైక్య వాదులంతా తరలి రావాలని ఆయన తెలిపారు.