జేసీ బదిలీ | JC Transfer | Sakshi
Sakshi News home page

జేసీ బదిలీ

Jan 8 2015 12:56 AM | Updated on Sep 2 2017 7:21 PM

జేసీ బదిలీ

జేసీ బదిలీ

జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు విశాఖపట్నంలోని ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీగా బదిలీ అయ్యారు.

కాకినాడ సిటీ/సాక్షి, రాజమండ్రి : జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు విశాఖపట్నంలోని ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో జిల్లాకు జాయింట్ కలెక్టర్‌గా అనంతపురం జేసీగా పని చేస్తున్న ఎస్.సత్యనారాయణ నియమితులయ్యారు. కాగా రాజమండ్రి మున్సిపల్ కమిషనర్‌గా ఐఏఎస్ అధికారి, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పని చేస్తున్న జె.మురళి నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీపై జిల్లా నుంచి వెళుతున్న ముత్యాలరాజు 2007 ఐఏఎస్ బ్యాచ్‌లో టాపర్‌గా నిలిచారు. అనంతరం రంగారెడ్డి జాయింట్ కలెక్టర్‌గా నియమితులయ్యారు. జిల్లాలో 2013 జూలై ఒకటిన బాధ్యతలు చేపట్టిన ఆయన 18 నెలల ఏడు రోజులు ఇక్కడ పనిచేశారు. కొత్త జేసీగా రానున్న సత్యనారాయణ గ్రూప్-1 బ్యాచ్‌కు చెందిన అధికారి. 2007లో ఐఏఎస్ హోదా పొందారు. గతంలో జిల్లాలోని పెద్దాపురం ఆర్డీఓగా, డీఆర్‌డీఏ పీడీగా, జిల్లా పరిషత్ సీఈఓగా పనిచేశారు.
 
 పుష్కరాల నేపథ్యంలోనే ఐఏఎస్ కమిషనర్
 మూడ్లేళ్ల తర్వాత రాజమండ్రి నగరపాలక సంస్థకు ఐఏఎస్ అధికారి కమిషనర్‌గా వస్తున్నారు.  ఇంతవరకూ రాజమండ్రి కమిషనర్‌గా పనిచేసిన రవీంద్రబాబును బదిలీ చేసి వెయిటింగ్‌లో పెట్టినట్టు తెలిసింది.గోదావరి పుష్కరాల నేపథ్యంలోనే కమిషనర్‌ను మార్చినట్టు భావిస్తున్నారు.  అంతే కాక  రవీంద్ర బాబు తమకు సహకరించడం లేదన్న టీడీపీ నేతల ఆగ్రహం కూడా బదిలీకి కారణమైందంటున్నారు.
 

Advertisement

పోల్

Advertisement