రాజమండ్రిలో మెడికల్‌ కాలేజీకి లైన్‌ క్లియర్

Jakkampudi Raja Says Rajahmundry Medical College Line Clear At East Godavari - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రిలో మెడికల్‌ కాలేజీకి లైన్‌ క్లియర్‌ అయిందని కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా అన్నారు. ఆయన శనివారం మీడయాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు మొదటిదశలోనే అనుమతులు వచ్చే అవకాశం ఉందన్నారు. మెడికల్ కళాశాల నిర్మాణానికి యాభై ఎకరాల స్థలం అవసరం ఉందని ఆయన తెలిపారు.  ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి అనుబంధంగా మెడికల్ కళాశాల ఏర్పాటు కానుందన్నారు. వెయ్యి పడకల ఆసుపత్రిగా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు అవుతుందన్నారు. (విశాఖ విషాదం: ఎల్‌జీ పాలిమర్స్‌ క్షమాపణ)

అవసరమైతే  మరో 30 ఎకరాల భూసేకరణ ప్రయత్నాలు చేస్తామని రాజా తెలిపారు. ఇప్పటికే రెండు మూడు చోట్ల ప్రభుత్వ భూములు పరిశీలించామని ఆయన చెప్పారు. ప్రభుత్వ వైద్య కళాశాల రాజమండ్రిలో ఏర్పాటు చేస్తే స్థానికులతో పాటు ఇతర జిల్లాల వారికి కూడా ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. ఎంత ఖర్చయినా ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఇంటి స్థలం అందించాలనేది సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కల అని గుర్తు చేశారు. దానికి అనుగుణంగానే చర్యలు చేపడుతున్నామని జక్కపూడి రాజా తెలిపారు. (గ్యాస్‌ లీక్‌పై విచారణకు హైపవర్‌ కమిటీ)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top