జగన్‌తోనే ఆరోగ్యశ్రీ సాధ్యం

జగన్‌తోనే ఆరోగ్యశ్రీ సాధ్యం - Sakshi


నాగాయలంక(చల్లపల్లి), న్యూస్‌లైన్ : మహానేత, దివంగత ముఖ్యమంత్రి  వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకంలో 259 వ్యాధులను తొలగించారని, అన్ని వ్యాధులకు ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలంటే పార్టీ అధినేత ఒక్క జగన్‌తోనే సాధ్యమవుతుందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ అన్నారు. నాగాయలంక వినాయక గుడి సెంటర్‌లో వైఎస్సార్ స్వచ్ఛంద సేవాసంస్థ అధ్యక్షుడు యాసం చిట్టిబాబు ఆధ్వర్యంలో గాంధీ వర్థంతి, వైఎస్.రాజశేఖరరెడ్డి సంస్మరణార్థం గురువారం మహారక్తదాన శిబిరం నిర్వహించారు.



ముఖ్యఅతిథిగా విచ్చేసిన సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ వైఎస్.రాజశేఖరరెడ్డి పాలనలో ప్రతి కుటుంబం ఏదో ఒక విధంగా లబ్ధిపొందిందన్నారు. ఆయన ప్రవేశ పెట్టిన అన్ని పథకాలు తిరిగి కొనసాగించాలంటే  జగన్ ముఖ్యమంత్రి కావడం తప్పదని చెప్పారు.   అధ్యక్షత  వహించిన జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను మాట్లాడుతూ రక్తదానంతో ప్రాణాపాయంలో ఉన్న వారిని కాపాడవచ్చన్నారు.



ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించేందుకు మరికొంతమంది పార్టీనాయకులు ముందుకు రావాలని కోరారు.  కేంద్రపాలక మండలి సభ్యురాలు ఉప్పులేటి కల్పన, మచిలీపట్నం పార్లమెంటు క న్వీనర్ డాక్టర్ కేవీఆర్ విద్యాసాగర్, నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు మాట్లాడుతూ సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడం వల్లనే రాష్ట్రంలో ఈ దుస్థితి నెలకొందని, జగన్ వంటి సత్తాగల నేతను ఎన్నుకునేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు.



యాసంను రెడ్‌క్రాస్ కార్యదర్శి బాపిరాజు, అవనిగడ్డకు చెందిన అన్నపరెడ్డి పెద్దబ్బాయ్ గజమాలతో సత్కరించగా, కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ యాసం మెమొం టోలు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.  పార్టీ ముఖ్యనేతలు మాదివాడ రాము, సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి,  గుడివాక శివరావ్,  విశ్వనాధపల్లి సత్యనారాయణ, దాసి దేవదర్శనం, అరజా నరేంద్రకుమార్, పరిశె మాధవరావు, చండ్ర వెంకటేశ్వరరావు, వేమూరి వెంకట్రావ్, చెన్ను రంగారావు,  గాజుల మురళీకృష్ణ, పొన్నూరు నాంచారయ్య, కోసూరు గోపీచంద్, మునిపల్లి భాస్కరరావు, దిడ్ల ప్రసాద్, ఒడుగు నరేంద్ర, యలవర్తి శ్రీరామ్మూర్తి, యలవర్తి ప్రకృతి రాజబాబు, మురాల శ్రీనివాసరావు,  లుక్కా శ్రీనివాసరావు,  సనకా శేషుబాబు, ఒడుగు నాగబాబు, సినీ నటుడు వెంకట్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

 

సమైక్యం కోసమే....

 

మచిలీపట్నం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకే కట్టుబడి ఉందని  పిల్లి సుభాష్‌చంద్రబోస్ స్పష్టం చేశారు. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ కేవీఆర్ విద్యాసాగర్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన తరుణంలోనే ఎంపీగా ఉన్న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి పార్లమెంటులో సమైక్యాంధ్రకు మద్దతుగా ప్లకార్డులు ప్రదర్శించి తాను సమైక్యవాదినేనని చాటి చెప్పారన్నారు. రాష్ట్ర విభజన బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతున్నట్లు చెప్పారు. వైఎస్‌ఆర్ సీపీ బందరు పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ కేవీఆర్ విద్యాసాగర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేం దుకు పార్టీ రాజీలేని పోరాటం చేస్తోందన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top