ముంచుకొస్తున్న వంటగ్యాస్ కొరత


=ప్రజలంతా గోబర్ గ్యాస్ ఏర్పాటు చేసుకోవాలి

 =మనిషి మల, మూత్రాల్లోనూ పోషకాలు

 =ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త సుభాష్‌పాలేకర్


 

వరంగల్‌అగ్రికల్చర్/ హసన్‌పర్తి, న్యూస్‌లైన్: రానున్న 30 ఏళ్లలో వంట గ్యాస్‌కొరత ముంచుకొస్తుందని, ఈ విషయాన్ని ప్రజలు ఇప్ప టి నుంచే గ్రహించాలని బసవశ్రీ అవార్డు గ్రహీ త, ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త సుభాష్‌పాలేకర్ హెచ్చరించారు. కాకతీయ ఫౌండేషన్, శ్రీ మహ ర్షి గోశాల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నగర శి వారులోని చింతగట్టు బీజీఆర్ గార్డెన్‌లో నిర్వహిస్తున్న ‘గోఆధారిత పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం’ శిక్షణ తరగతులు శుక్రవారం రెండో రో జుకు చేరాయి.



ఈ సందర్భంగా రైతులకు జీవామృతం తయారీ, వినియోగంపై అవగాహన కల్పించారు. అనంతరం సుభాష్‌పాలేకర్ మాట్లాడుతూ వంటగ్యాస్ ఉత్పత్తులు తగ్గే ప్రమాదం ఉన్నందున గ్రామీణ, పట్టణ ప్రజలందరూ ఇప్ప టి నుంచే గోబర్‌గ్యాస్ ఏర్పాటు చేసుకోవాలన్నా రు. జర్సీ ఆవుల పెంపకం వల్ల ఉపయోగం లేద ని, వాటి పెంపకానికి రైతులు దూరంగా ఉండాల ని ఆయన  సూచించారు. కాగా, శిక్షణ తరగతు ల్లో పాలేకర్ జీవామృతం, దేశీయ ఆవుపేడ ఉప యోగంపై వివరించారు.

 

గోబర్‌గ్యాస్ తయారీ ఇలా..



గోబర్‌గ్యాస్ బయటికి వెలువడిన తర్వాత పేడ(స్లరీ) తో ఘన జీవామృతం తయారు చేసుకునే విధానాన్ని పాలేకర్ రైతులకు వివరించారు. 50 కిలోల ఎండిన, జల్లెడ పట్టిన గోబర్‌గ్యాస్ స్లరీని తీసుకోవాలి. అం దులో 50 కిలోల దేశీయ ఆవుపేడను కలుపాలి. అందు లో కిలో బెల్లం, కిలో పప్పు పిండిని మిక్సింగ్ చేయాలి. అనంతరం దానిని పూర్తిగా కలియబెట్టాలి. ఆ మిశ్రమాన్ని  48 గంటల పాటు నీడలో ఉంచాలి. ఇలా నీడ లో ఉంచడం వల్ల కిణ్మయ ప్రక్రియ జరుగుతుందని వివరించారు. ఆ తర్వాత 48 గంటల పాటు ఎండలో అరబెట్టాలి. ఎండిన తర్వాత ఆ మిశ్రమాన్ని చూర్ణం చే సి ఒక గోనె సంచిలో భద్రపరచాలి. అయితే గోనె సం చిలో నింపిన చూర్ణాన్ని ముళ్లె కట్టి నేలపై ఉంచకుండా చెక్కపై పెట్టాలి. నేలపై ఉంచినట్లయితే తేమశాతం పెరిగే అవకాశం ఉంది. ఈ చూర్ణాన్ని ఏడాది పాటు  వినియోగించుకోవచ్చు.

 

మనిషి మలమూత్రాల్లో పోషకాలు..




మనిషి మలమూత్రాల్లో కూడా పోషకకణాలు ఉంటాయని సుభాష్‌పాలేకర్ వివరించారు. మనిషి రోజువా రీ విసర్జ్జీతాల పరిమాణం చూస్తే..  మలం 100 నుంచి 400 గ్రాములు, మూత్రం 1000 నుంచి 1310 గ్రాము లు ఉంటాయి. అయితే ఇవి కూడా పంటల పోషకాలు గా ఉపయోగించుకోవచ్చు. మానవ మూత్రాలు తప్ప జీవామృతంలో ఉపయోగించేవి రాక్షస మూత్రాలు కావని ఆయన సూచించారు.

 

 ఒక దేశీయ ఆవుతో 30ఎకరాల సాగు..

 ఒక దేశీయ ఆవు రోజుకు సగటున 11 కిలోల పేడ ఇ స్తుంది. ఒక కిలో పేడతో ఎకరం వ్యవసాయం చేయొ చ్చు. అంటే నెలకు సగటున 30 ఎకరాల సాగు చేయవచ్చని వివరించారు. దేశీయ ఆవు పేడలో 300 కోట్ల నుంచి 500 కోట్ల వరకు ఉపకరించే సూక్ష్మ జీవులు ఉం టాయి. ఇది ఒక అద్భుతమైన సూక్ష్మజీవుల సమూహం లాంటిది. భూమిపై పడిన చెట్టు, మొక్కల ఆకులు, కొ మ్మలా రెమ్మలవంటి కాష్ట పదార్థాన్ని(బయోమాస్)ను ఈ విసర్జితాలతో ఉండే సూక్ష్మజీవులు కుళ్లబెడతాయి. కుళ్లిన చెత్తాచెదారం నుంచి పోషకాలు విడుదలై మొక్కల కు అందుబాటులోకి వస్తాయి. దీంతో పంటల ఎదుగుదలతో పాటు  అధిక దిగుబడులు పొందవచ్చన్నారు.

 

 భూమిలో పోషకాలు పుష్కలం...

 భూమిలోనే మొక్కలు, చెట్లకు అవసరమయ్యే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి కానీ, రెండు కారణాల వల్ల అవి వేర్లకు అందుబాటులో లేవు. మొదటి కారణం ఏమంటే భూమిలో ఉన్న ఖనిజాలు వేర్లకు కావాల్సిన స్థితిలో లే వు. మనం రోజు భోజనం చేసేందుకు ఆహార ధాన్యాన్ని ఉడికించుకుని తింటాము. కానీ, ఉన్నవాటిని ఉన్నట్లుగా తినలేము. అదే మాదిరిగా భూమిలో కూడా పంటలకు అవసరం ఉన్న పోషకాలు వేరే రూపంలో ఉన్నాయి. మొక్కల వేర్లు నేరుగా గ్రహించలేని విధంగా ఉన్నాయి. వీటిని మొక్కల వేళ్లు గ్రహించగలిగే రూపంలోకి మార్చే పనిని మట్టిలోని అనంతర కోటి సూక్ష్మజీవులు చేస్తాయని పాలేకర్ వివరించారు.

 

 దేశీయ ఆవు పేడతో ఘన జీవామృతం తయారీ

 దేశీయ ఆవుపేడతో ఘన జీవామృతం తయారీ విధానాన్నిపాలేకర్ వివరించారు. ఎకరం పొలంలో ఏ మోతాదులో ఆవు పేడ వినియోగించాలో రైతులకు అవగాహన కల్పించారు. 100 కిలోల దేశీయ ఆవు పేడలో కిలో బెల్లంతో పాటు ద్విదళ బీజాల పిండిని కలపాలి. ఆ మిశ్రమాన్ని నీడలో కుప్పగా పోయాలి. అనంతరం మిశ్రమంపై వర్షపు నీరు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తొలుత 48 గంటల పాటు నీడలో ఉంచిన తర్వాత మరో 48 గంటలు ఎండలో అరబెట్టాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని చూర్ణం చేసి గోనె సంచిలో నింపి చెక్కపై పెట్టాలి. ఇది కూడా ఏడాది పాటు వినియోగించుకోవచ్చు. అయితే ఈ చూర్ణాన్ని గోమూత్రంతో కలిపి లడ్డులా చేసి పంటలకు నీరు పా రించే కాల్వల ముఖద్వారం వద్ద పెడితే ఎరువు రంగులో నీటి ద్వారా పంటలకు పోషకాలు అందిస్తాయి.

 

 జీవామృతం పిచికారీ

 జీవామృతంను భూమిలో వేయడంతో పాటు పంటలు, పండ్ల చెట్లపై పిచికారీ చేయొచ్చు. వరి, అరటి, మొక్కజొన్న, పెసర, మినుము, శనగ, పొద్దు తిరుగుడు, బబ్బెర్లు, మిరప, ఉల్లి, టామాటా, వంకాయ తదితర కూరగాయాల మొక్కల వంటి 2 నుంచి 8నెలల కాలవ్యవధిలో పూర్తయ్యే పంటలకు పిచికారీ చేయాలి. జీవామృతాన్ని ఏ పం టలపైన అయిన ప్రతి 15 రోజులకోసారి, నెలకోసారైన పిచికారీ చేయాలి. విత్తనం వేసినప్పటికీ నుంచి విత్తనం వేసిన, మొక్కనాటిన 15 రోజులకోసారి పిచికారీ చేయాలి. ప్రతి ఎకరానికి ఐదు లీటర్ల వడబోసిన జీవామృతాన్ని వందలీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. తర్వాత 30 రోజులకు పిచికారీ చేయాలి.



మళ్లీ 45 రోజులకు 10 లీటర్ల జీవామృతంలో 150 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. 60 రోజుల పంటలకు 20 లీటర్ల జీవామృతానికి 200 లీటర్ల నీటిని కలపాలి. దీనిని 75 రోజుల వరకు అలాగే కొనసాగించాలి. కాగా, 90 రోజులకు 25 లీటర్ల జీవామృతంలో 200ల నీటిని కలిపి పిచికారీ చేయాలి. మూడున్నర, నాలుగు, నాలున్నర నెలల పంటలకు 25 లీటర్ల జీవామృతానికి 200 లీటర్ల నీటిని కలిపి పిచికారీ చేయాలి. ఐదు నెలల తర్వాత 30 లీటర్ల జీవామృతాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలని సూచించారు. దీంతో పంటల్లో అద్భుతమైనఫలితాలు వస్తాయని సుభాష్ పాలేకర్ రైతులకు వివరించారు.

 

 దేశీయ ఆవు పేడలో పోషకాలు..


 దేశీయ ఆవు పేడలో నత్రజని 1.74 శాతం, భాస్వరం 1.7 శాతం, పొటాష్ 0.6 శాతం, కాల్షియం 0.37 శాతం, మెగ్నీషియం 0.53 శాతం లోహం 1400 పీపీఎం, మాంగనీస్ 5.0 పీపీఎం, తుత్తు నాగం 90 శాతం ఉంటాయని పాలేకర్ వివరించారు. కాగా, ప్రకృతి వ్యవసాయం అనే రథానికి నా లుగు చక్రాలు. ఆ నాలుగు చక్రాలు సక్రమంగా సాగాలంటే రైతులు బీజామృతం, జీవామృతం, అచ్చాదన, వాప్సల ఉ పయోగాలపై పాలేకర్ రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కాకతీయ ఫౌండేషన్ అధ్యక్షుడు నరహరి వేణుగోపాల్‌రెడ్డి, శ్రీమహర్షి గోశాల చారిటబుల్‌ట్రస్ట్ అధ్యక్షుడు సజ్జన రమేష్, మీడియా ఇన్‌చార్జ్ రాంచంద్రారెడ్డితో పాటు వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం జిల్లాలకు చెం దిన సుమారు వేయి మంది రైతులు పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top