దేశవ్యాప్తంగా కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ ధరపై (LPG gas price) ఊరట లభించింది. 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ రిటైల్ ధరను ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు సవరించాయి. నవంబర్ 1న కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా పలు ప్రధాన నగరాల్లో 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
ధరల సవరణ తర్వాత ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ రిటైల్ ధర రూ.5 తగ్గి రూ.1,590.50గా ఉంది. అంతకుముందు ఇది 1595.50గా ఉండేది.
కోల్కతాలో 19 కిలోల సిలిండర్ ధర రూ.6.5 క్షీణించి రూ.1694 లకు వచ్చింది. మునుపటి ధర రూ.1700.50 గా ఉండేది.
ముంబైలో 19 కిలోల సిలిండర్ ధర రూ.5 తగ్గి రూ.1542గా ఉంది. అంతకుముందు ధర రూ.1547.
చెన్నైలో 19 కిలోల సిలిండర్ ధర రూ.4.5 మేర తగ్గి రూ.1750 లకు వచ్చింది. మునుపటి ధర రూ.1754.50
హైదరాబాద్లో 19 కిలోల సిలిండర్ ధర రూ.4.5 క్షీణించి రూ.1,647.50 లుగా ఉంది. అంతకుముందు ధర రూ.1,652.
విశాఖపట్నంలో 19 కిలోల సిలిండర్ ధర రూ.4.5 మేర తగ్గి రూ.1,647.50 లకు వచ్చింది. మునుపటి ధర రూ.1,652గా ఉండేది.
19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర గత సెప్టెంబర్లో రూ .15.50 పెరిగిన తరువాత, నవంబర్ 1 నుండి మళ్లీ ధరలు తగ్గడంతో వీటిని వినియోగించే హోటల్ వ్యాపారులు, క్యాటరింగ్ నిర్వాహకులకు కాస్త ఉపశమనం లభించినట్లయింది. అయితే సాధారణంగా ఇళ్లలో వినియోగించి డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
అయితే కమర్షియల్ ఎల్పీజీ ధరలను తగ్గించినా దేశీయ విమానాల్లో వినియోగించే ఇంధనం ఏటీఎఫ్ రేట్లను మాత్రం చమురు సంస్థలు పెంచాయి. ఢిల్లీలో దేశీయ విమానయాన సంస్థల ఏటీఎఫ్ ధర కిలోలీటరుకు రూ .777 పెరిగి రూ .94,543.02 కు చేరుకుంది.


