మరోసారి తగ్గిన ఎల్‌పీజీ సిలిండర్ ధరలు | LPG Cylinder Price Cut Rs 24, Check Out New Prices Which Effective From June 1st | Sakshi
Sakshi News home page

LPG Cylinder Prices: మరోసారి తగ్గిన ఎల్‌పీజీ సిలిండర్ ధరలు

Jun 1 2025 9:37 AM | Updated on Jun 1 2025 12:08 PM

LPG Cylinder Price Cut Rs 24

దేశవ్యాప్తంగా వాణిజ్య వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా చమురు మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.24 తగ్గించాయి. కొత్త ధరలు రెస్టారెంట్లు, హోటళ్ళు, ఇతర వాణిజ్య సంస్థలకు ఉపశమనం కలిగిస్తాయి. ఈ రోజు (జూన్ 1) నుంచే ఈ ధరలు అమలులోకి వస్తాయి.

వాణిజ్య ఎల్‌పీజీ ధరలు తగ్గడం వరుసగా ఇది మూడోసారి. మే ప్రారంభంలో కంపెనీలు 19 కిలోల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ.14.50 తగ్గించాయి. అంతకు ముందు ఏప్రిల్ 1న సిలిండర్‌ ధర రూ.41 తగ్గింది. కాగా ఇప్పుడు రూ.24 తగ్గింది. కమర్షియల్‌ గ్యాస్‌ ధరలు తగ్గినా.. గృహాల్లో ఉపయోగించే ఎల్‌పీజీ ధరలలో ఎలాంటి మార్పు లేదు.

19 కిలోల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధరలు
•ఢిల్లీ: రూ. 1723.50
•కోల్‌కతా: రూ. 1826
•ముంబై: రూ. 1674.50
•చెన్నై: రూ. 1881

ఇదీ చదవండి: జీవితాన్ని నాశనం చేసే పదం ఇదే: రాబర్ట్ కియోసాకి హెచ్చరిక

Advertisement
 
Advertisement
Advertisement