డ్రైవర్ తాగి బస్సు నడిపినందువల్లే ప్రమాదమా? | Is the Mahabubnagar bus accident a case of drunken driving? | Sakshi
Sakshi News home page

డ్రైవర్ తాగి బస్సు నడిపినందువల్లే ప్రమాదమా?

Oct 30 2013 12:34 PM | Updated on Oct 8 2018 5:04 PM

డ్రైవర్ తాగి బస్సు నడిపినందువల్లే ప్రమాదమా? - Sakshi

డ్రైవర్ తాగి బస్సు నడిపినందువల్లే ప్రమాదమా?

మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం డ్రైవర్ తప్పిదం వల్లే జరిగిందా అనే అనుమానం వ్యక్తం అవుతోంది.

హైదరాబాద్ : మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం డ్రైవర్ తప్పిదం వల్లే జరిగిందా అనే అనుమానం వ్యక్తం అవుతోంది. వోల్వో బస్సు డ్రైవర్ మద్యం సేవించి బస్సు నడిపినందువల్లే ఈ ప్రమాదం జరిగిందని వైద్యులు అనుమానిస్తున్నారు. నిర్థారణ కోసం డ్రైవర్ రక్త నమూనాను పరీక్షల కోసం వైద్యులు హైదరాబాద్ పంపించారు.

కాగా కారును ఓవర్ టేక్ చేస్తున్న సమయంలో బస్సు అదుపు తప్పి కల్వర్ట్ను ఢీకొన్నట్లు వ్వోలో బస్సు డ్రైవర్ తెలిపాడు. దాంతో డీజిల్ ట్యాంక్ పేలిందని...బస్సులో మంటలు చెలరేగగానే క్లీనర్, తాను బస్సు నుంచి దూకేసినట్లు పోలీసుల విచారణలో చెప్పాడు. బస్సు ప్రమాదంలో మృతి చెందినవారి సంఖ్య 45కు చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement