వేగవంతమైన దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్లపై విచారణ | Sakshi
Sakshi News home page

వేగవంతమైన దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్లపై విచారణ

Published Sat, Sep 14 2013 7:22 PM

వేగవంతమైన దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్లపై విచారణ

హైదరాబాద్: నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) సహవ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్, అతని సహచరుడు అసదుల్లా అఖ్తర్‌ అలియాస్ తబ్రేజ్ అలియాస్ ‘హడ్డి’లు పోలీసులకు పట్టు బడటంతో దిల్‌సుఖ్‌నగర్‌ జంట బాంబు పేలుళ్ల విచారణ వేగవంతమైంది. పేలుళ్ల సూత్రదారి అసదుల్లా అఖ్తర్‌ను అర్ధరాత్రి పోలీసులు హైదరాబాద్‌ తరలించారు. పేలుళ్లకు ముందు తాను షెల్టర్‌ తీసుకొన్న ఇంటిని సోదాచేసి పలు కీలక ఆధారాలు సేకరించారు. అనంతరం ఉదయాన్నే డిల్లీ తరలించారు. పిటి వారెంట్‌పై పట్టబడిన నిందితులను హైదరాబాద్‌ తరలించేందుకు రాష్ట్ర పోలీసులు కోర్టును కోరనున్నారు.  

ఫిబ్రవరి 21 దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల సూత్రధారులు ఇండియన్‌ ముజాహిదిన్‌ ఉగ్రవాదాలు  యాసిన్‌ భత్కల్‌, అసదుల్లా అక్తర్‌లను ఆరునెల్ల తర్వాత ఎట్టకేలకు పట్టుబడ్డారు. ఇండో-నేపాల్‌ సరిహద్దులో బీహార్‌ పోలీసులు అగస్ట్‌ 28న వారిని అదుపులోకి తీసుకొన్నారు. అనంతరం డిల్లీ తరలించిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) పలుకోణాల్లో వీరిద్దరిని  విచారించింది. భక్తల్‌, అక్తర్‌లు ఇచ్చిన సమాచారంతో బీహార్‌లో పలుచోట్ల ఎన్‌ఐఎ బృందం సోదాలు నిర్వహించింది.   దిల్‌సుఖ్‌నగర్‌ జంట బాంబు పేలుళ్లకు తానే వ్యూహం పన్నినట్లు  యాసిన్ భత్కల్ అంగీకరించాడు. హైదరాబాద్ నగరంలో బాంబు పేలుళ్లకు వ్యూహ రచన చేసి విధ్వంసానికి కారణమైనట్లు తెలిపాడు. దిల్‌సుఖ్‌నగర్‌  బాంబు పేలుళ్లతో పాటు దేశవ్యాప్తంగా సుమారు 40 బాంబు పేలుళ్ల కేసులలో భత్కల్  నిందితుడు.  

Advertisement
Advertisement