మందలించారని విద్యార్థి అదృశ్యం | Intermediate student missing | Sakshi
Sakshi News home page

మందలించారని విద్యార్థి అదృశ్యం

Dec 1 2015 5:58 PM | Updated on Sep 3 2017 1:19 PM

తోటి విద్యార్థినితో తలెత్తిన విభేదాల నేపథ్యంలో ఓ విద్యార్థి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. విశాఖలో స్టీల్‌ప్లాంట్ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఉక్కునగరం (విశాఖపట్నం) : తోటి విద్యార్థినితో తలెత్తిన విభేదాల నేపథ్యంలో ఓ విద్యార్థి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. విశాఖలో స్టీల్‌ప్లాంట్ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న ఎస్.శివసూర్య(15)ను మూడు రోజుల క్రితం తోటి విద్యార్థిని తిట్టింది. అయితే ఆ సమయంలో సూర్య తల్లిదండ్రులు పక్కనే ఉండటంతో ఆమెను ప్రశ్నించారు.

అనంతరం బాలిక కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. సోమవారం తల్లిదండ్రులతోపాటు శివసూర్యను కాలేజీ ప్రిన్సిపాల్ పిలిపించి మాట్లాడారు. కాగా సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన శివసూర్య తిరిగి రాలేదు. తెలిసినవారి వద్ద వాకబు చేసినా ఫలితం లేకపోవటంతో తల్లిదండ్రులు మంగళవారం ఉక్కునగరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement