కొత్తపల్లిలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య | inter student suicide in kothapalli | Sakshi
Sakshi News home page

కొత్తపల్లిలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

Aug 23 2014 2:01 AM | Updated on Nov 6 2018 7:56 PM

తండ్రి మందలించాడని ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని కొత్తపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది.

మాచర్లటౌన్: తండ్రి మందలించాడని ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని కొత్తపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన షేక్ పెద్ద సైదులు కుమారుడు సైదులు (19) గుంటూరులో ఇంటర్‌మీడియట్ చదువుతున్నాడు. సరిగా చదువుకోకుండా తరుచూ ఇంటికి వస్తుండడంతో కుమారుడిపై తండ్రి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

శుక్రవారం కూడా మందలించడంతో ఇంట్లో ఎవరూ లేని సైదులు ఇంట్లో నిల్వ ఉన్న పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కొద్దిసేపటికి విషయాన్ని గమనించిన బంధువులు సైదులును మాచర్లలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్థారించారు. సైదులు మృతదేహాన్ని కొత్తపల్లికి తరలించారు. విషయం తెలుసుకున్న విజయపురిసౌత్ పోలీసులు ఆత్మహత్యకు సంబంధించి వివరాలు సేకరించారు.

Advertisement
 
Advertisement
Advertisement