టీడీపీ నేత ఇంట్లో ఐటీ దాడులు | Income Tax Raids In TDP Leader Peram haribabu Houses And Offices | Sakshi
Sakshi News home page

టీడీపీ నేత ఇంట్లో ఐటీ దాడులు

Oct 30 2018 12:16 PM | Updated on Oct 30 2018 1:07 PM

Income Tax Raids In TDP Leader Peram haribabu Houses And Offices - Sakshi

టీడీపీ నేత పేరం హరిబాబు

సాక్షి, హైదరాబాద్‌: ఏపీలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. మంగళవారం పేరం గ్రూపు అధినేత, రియల్టర్‌  పేరం హరిబాబు సంస్థల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పేరం హరిబాబు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడు. చంద్రగిరి నియోజకవర్గంలో కీలక నేత. గుంటూరు జిల్లా గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు వియ్యంకుడు.

విశాఖపట్నం, హైదరాబాద్‌, తిరుపతిలోని పేరం గ్రూపు కార్యాలయాల్లో 9 బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. పేరం గ్రూపునకు చెందిన జీజీఆర్‌ హౌసింగ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌లోనూ సోదాలు జరుగుతున్నాయి. పేరం హరిబాబు చేస్తున్న వ్యాపారానికి, ప్రభుత్వానికి చెల్లించే పన్నులకు చాలా వ్యత్యాసం ఉన్నట్లు అనుమానం రావడంతోనే ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అలాగే కర్ణాటక రాష్ట్రంలోని హోస్పేట్‌ సమీపంలోని పేరం రియల్ ఎస్టేట్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement