'ఆ వార్తల్లో నిజం లేదు' | Iam not the TTD Chairman says K Raghavendra Rao | Sakshi
Sakshi News home page

'ఆ వార్తల్లో నిజం లేదు'

Jan 25 2018 12:02 PM | Updated on Aug 25 2018 7:16 PM

Iam not the TTD Chairman says K Raghavendra Rao - Sakshi

దర్శకుడు కె. రాఘవేంద్రరావు

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా తాను భాద్యతలు చేపట్టబోతున్నట్టు వస్తున్న వార్తలను దర్శకుడు కె. రాఘవేంద్రరావు ఖండించారు.

సాక్షి, హైదరాబాద్‌: తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా తాను భాద్యతలు చేపట్టబోతున్నట్టు వస్తున్న వార్తలను ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు ఖండించారు. గత రెండు మూడు రోజులుగా కొన్ని పత్రికల్లో, సోషల్‌ మీడియాలో రాఘవేంద్రరావు టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నట్టు వార్తలు వచ్చాయి. దీంతో ఆయన సన్నిహితులు అభినందనలు తెలిపారు. 

అయితే ఈ విషయంపై బయట వస్తున్న వార్తల్లో నిజం లేదని రాఘవేంద్రరావు వెల్లడించారు. ఎస్వీఎస్సీ ఛానల్‌ ద్వారా స్వామివారి సేవ చేస్తున్నానని.. మరిన్ని వైవిధ్యమైన కార్యక్రమాలతో అలరిస్తూ స్వామి సేవలో తరలించాలన్నదే తన కోరిక అని దర్శకేంద్రుడు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన టీటీడీ బోర్డు మెంబర్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement