హైదరాబాద్‌ యూటీ చిరంజీవి వ్యక్తిగతం: ఎంపీ అనంత | Hyderabad as Union Territory proposal chiranjeevi personal: MP Anantha venkatarami reddy | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ యూటీ చిరంజీవి వ్యక్తిగతం: ఎంపీ అనంత

Aug 29 2013 4:40 PM | Updated on Sep 4 2018 5:07 PM

హైదరాబాద్‌ యూటీ చిరంజీవి వ్యక్తిగతం: ఎంపీ అనంత - Sakshi

హైదరాబాద్‌ యూటీ చిరంజీవి వ్యక్తిగతం: ఎంపీ అనంత

తామందరం సమైక్యరాష్ట్రానికే కట్టుబడి ఉన్నామని అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు.

తామందరం సమైక్యరాష్ట్రానికే కట్టుబడి ఉన్నామని అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలనేది చిరంజీవి వ్యక్తిగత అభిప్రాయని చెప్పారు. మూడు ప్రాంతాల ప్రజలు కలిసి హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లును అడ్డుకుంటామని ఆయన చెప్పారు. సొంత ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజనపై రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు.

రాష్ట్ర విభజన ప్రకటనను వెనక్కు తీసుకుంటున్నట్లు ‘కేంద్ర ప్రభుత్వం’ స్పష్టమైన హామీ ఇచ్చేవరకు పార్లమెంటులో నిరసనలు ఆపబోమని అంతకుముందు అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. సీమాంధ్రలో ఉద్యమం తీవ్రంగా ఉందని ఆయన తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో అన్నివర్గాల వారు పాల్గొంటున్నారని  పేర్కొన్నారు.  సీమాంధ్రలో కొనసాగుతున్న ప్రజా ఉద్యమాన్ని జాతీయ పార్టీలు గుర్తించాయన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement