కట్టుకున్నోడే కడతేర్చాడు | husband blast kerosene to wife | Sakshi
Sakshi News home page

కట్టుకున్నోడే కడతేర్చాడు

Jan 2 2014 3:27 AM | Updated on Sep 2 2017 2:11 AM

మరికొన్ని నె లల్లో తమ కూతురు ఓ పాపకు జన్మనిస్తుంన్న సంతోషంలో ఉన్న తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిలాయి.. పిల్లాపాపల తో తన కూతురు ఎంతో సంతోషంగా గడుపుతుందని ఆశించిన వా రికికి విషాదం మిగిలింది..

కొందుర్గు, న్యూస్‌లైన్ : మరికొన్ని నె లల్లో తమ కూతురు ఓ పాపకు జన్మనిస్తుంన్న సంతోషంలో ఉన్న తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిలాయి.. పిల్లాపాపల తో తన కూతురు ఎంతో సంతోషంగా గడుపుతుందని ఆశించిన వా రికికి విషాదం మిగిలింది.. జీవితాం తం కలి సుంటానని, కష్టసుఖాల్లో పాలు పం చుకుంటూ, జీ వితాంతం తోడుగా ఉం టానని, ఏడడుగులు నడిచిన భ ర్తే భార్య పాలిట యముడయ్యాడు.. గర్భిణి అన్న కనికరం లే కుండా తీవ్రంగా కొట్టి చంపేసి, ఆపై ఒంటిపై కిరోసిన్‌పోసి నిప్పంటించాడు.. అందుకు ప్రియురాలి సహకారం తోడైంది.. పోలీసుల కథనం ప్రకారం... కేశంపేట మండలం కొత్తపేటకు చెందిన ఉమాదేవి (23) కి కొందుర్గు వాసి సర్వని శ్రీనివాస్‌తో ఏడాది క్రితమే వివాహమైంది. ఆ సమయంలో 12 తులాల బంగారం, 25 తులాల వెండి, రూ. రెండు లక్షల నగదు ఇచ్చారు.
 
 ప్రస్తుతం భార్య ఐదు నెలల గర్భిణి. కొన్నినెలల నుంచి ఆమెను భర్త అదనపు కట్నం తీసుకురావాలని తరచూ వేధించసాగాడు. అలాగే అదే గ్రామానికి చెందిన మరో మహిళ మంజులతో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. ఉమాదేవి తండ్రి నారాయణ హమాలీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తాడు. తన కూతురు సంసారం బాగుండాలని అడిగినప్పుడల్లా కాస్తోకూస్తో ఇచ్చి పంపేవాడు. ఇటీవలే రూ. పది వేలు ఇచ్చాడు.
 
 ఈ క్రమంలోనే గత నెల 7న భార్యాభర్తలు పెళ్లిరోజు సైతం జరుపుకొన్నారు. ఆ సంతోషం కొన్ని రోజులైనా నిలవలేదు. చివరకు మంగళవారం అర్ధరాత్రి దాటాక ఇం ట్లోనే భర్తతోపాటు ప్రియురాలు కలిసి ఆమెను తీవ్రంగా కొట్టి హతమార్చా రు. దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించాలని భావించి మృతురాలి ఒంటిపై కి రోసిన్ పోసి నిప్పంటించారు. బుధవా రం ఉదయం చుట్టుపక్కలవారు గమనించి వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు.
 
 సంఘటన స్థలాన్ని డీఎస్పీ ద్రోణాచార్యులు, సీఐ రవీందర్‌రెడ్డి, ఏఎస్‌ఐ కృష్ణయ్య, తహశీల్దార్ పాండు పరిశీలించారు. అనంతరం మృతదే హా న్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రిలోని మార్చురీకి త రలించారు. కాగా తమ కూతురును అ ల్లుడితోపాటు ప్రియురాలు కలిసి హ త్య చేశారని మృతురాలి తల్లిదండ్రులు నారాయణ, యాదమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిం దితుడు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రియురాలు పరారీలో ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement