కడప నగరంలోని వైఎస్ రాజారెడ్డి-ఏసీఏ క్రికెట్‌మైదానంలో నిర్వహిస్తున్న కల్నల్ సీకే నాయుడు అండర్-23 మ్యాచ్‌లో హర్యాన జట్టు భారీస్కోరు దిశగా దూసుకెళ్తోంది.
కడప స్పోర్ట్స్ : కడప నగరంలోని వైఎస్ రాజారెడ్డి-ఏసీఏ క్రికెట్‌మైదానంలో నిర్వహిస్తున్న కల్నల్ సీకే నాయుడు అండర్-23 మ్యాచ్‌లో హర్యాన జట్టు భారీస్కోరు దిశగా దూసుకెళ్తోంది. 78 పరుగులతో ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగిన డాగర్ మంగళవారం 116 పరుగులు చేసి సెంచరీ సాధించాడు.
ఈయనతో పాటు క్రీజులో నిలిచిన యాదవ్ 55 పరుగులు చేసి అవుటయ్యాడు. పెహల్ 48 పరుగులు, తెవతీయ 97 పరుగులతో సెంచరీకి చేరువలో ఉన్నారు. మంగళవారం రెండోరోజు ఆటముగిసే సమయానికి హర్యాన జట్టు 180 ఓవర్లలో 512 పరుగులు చేసింది. ఆంధ్రా జట్టు బౌలర్‌లు వినీల్ 2, శశికాంత్ 2, స్నేహకిశోర్ 1, కమ్రుద్దీన్ 1 వికెట్ తీశారు. హర్యాన జట్టు బుధవారం ఇదే జోరు కొనసాగిస్తే ఆంధ్రా జట్టు ఎదురీదక తప్పని పరిస్థితి.